శబరిమలకు 12 స్పెషల్ ట్రైన్లు

హైదరాబాద్​, వెలుగు: శబరిమల యాత్రకు వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 16 నుంచి డిసెంబర్​ 1 వరకు 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్​ సెంట్రల్​ రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్​ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.  హైదరాబాద్​, నిజామాబాద్, కాకినాడ నుంచి కొల్లామ్ వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తామని చెప్పారు. హైదరాబాద్​ నుంచి కొల్లామ్​కు ఈ నెల 25, 29 తేదీల్లో సాయంత్రం 3.55కు, నిజామాబాద్​ నుంచి 21న రాత్రి 11.55కు, కాకినాడ నుంచి ఈ నెల 16, 20, 24 తేదీల్లో అర్ధరాత్రి 12.35కు ఈ రైళ్లు బయలుదేరుతాయని తెలిపారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates