కరెంట్ షాక్ తో ట్రాన్స్ కో ఏఈ మృతి

మణుగూరు,వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు 220 కేవీ సబ్ స్టేషన్ లో ఏఈ కరెంట్ షాక్ తో చనిపోయారు. సబ్ స్టేషన్ లో హాట్ లైన్స్ ఏఈ గా పని చేస్తున్న శ్రీధర్ (34) సోమవారం విద్యుత్ లైన్ లో పనిచేస్తుండగా ఇండక్షన్ తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. సబ్ స్టేషన్ లో నిచ్చెన ఎక్కి తాడు కట్టిన ప్లేసులో నిల్చోవడం, అది తడిసి ఉండడంతో షాక్ తగిలింది. శ్రీధర్ కు భార్య, బిడ్డ ఉన్నారు.

 

 

Latest Updates