పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌కు చెందిన 216 మంది లబ్దిదారులకు ఏడో విడతలో భాగంగా డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రి హరీశ్ రావు అందజేశారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లనుపరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి రెండున్నర ఏళ్లు కష్టపడ్డామని తెలిపారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో సుమారు 400 సార్లు ఈ ప్రాంతానికి వచ్చానని తెలిపారు మంత్రి హరీశ్.