సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఆర్టీఏ అధికారులు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ను చెక్ చేస్తున్నారు. శంషాబాద్, ఎల్బీ నగర్, సుచిత్ర తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పలు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులతో పాటు..సంకాంత్రి సందర్భంగా ఎక్కువ ఛార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. పాసింజర్ బస్సుల్లో కమర్షియల్ గూడ్స్ రన్ చేస్తున్నవారిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తొండుపల్లి దగ్గర ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ లేని, కెపాసిటీకి మించి లగేజీతో వెళ్తున్న బస్సులకు ఫైన్స్ వేశారు. 50 బస్సుల్లో తనిఖీ చేశామని, రూల్స్ కు విరుద్దంగా తిరుగుతున్న 15 బస్సులపై కేసు నమోదు చేశామని రంగారెడ్డి జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. అధిక ఛార్జీలు వసూల్ చేస్తే ట్రావెల్స్ పైనా కేసులు నమోదు చేస్తామన్నారు.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ దగ్గర నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న 15 బస్సులపై కేసు నమోదు చేశారు అధికారులు. 20 సీట్ల కెపాసిటీ ఉన్న బస్సులో 38 సీట్లు ఏర్పాటు చేసి తిప్పుతున్న ఛత్తీస్ గడ్ కు చెందిన బస్సును సీజ్ చేశారు.ఎల్బీ నగర్ లోనూ నాలుగురోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. నిబందనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 బస్సులను సీజ్ చేశారు. మరో ఆరు బస్సులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.