బోట్ ఫ్యూయల్ ట్యాంకులో డ్రగ్స్ రవాణా

తమిళనాడులో భారీగా మాదకద్రవ్యాలను పట్టుబడ్డాయి. బోట్​లోని ఖాళీ ఇంధన ట్యాంకులో డ్రగ్స్ దాచి రవాణా చేస్తున్నారని భారత కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించి బోట్ మీద దాడిచేశారు. ఈ దాడికి సంబంధించిన సమాచారాన్ని విశాఖ కోస్ట్ గార్డు అదనపు డైరక్టర్ జనరల్ కార్యాలయం
వెల్లడించింది. తమిళనాడులోని దక్షిణ తుత్తుకూడి వద్ద శ్రీలంక బోట్ నుంచి వంద కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు భారత కోస్ట్ గార్డు వెల్లడించింది. బోటులో ఉన్న ఆరుగురు శ్రీలంక జాతీయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపింది. శ్రీలంక పడవలో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయన్న సమాచారంతో కోస్ట్ గార్డు సిబ్బంది తొమ్మిది రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి ఆ బోటును పట్టుకున్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి ఈ మాదక ద్రవ్యాలను మార్పిడి విధానంలో తీసుకొస్తున్నట్లు శ్రీలంక జాతీయులు ప్రాథమిక విచారణలో చెప్పారని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్​ను ఆస్ట్రేలియాతోపాటు పశ్చిమ దేశాలకు చేరవేసేందుకు యత్నిస్తున్నారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 99 ప్యాకెట్ల హెరాయిన్, 20 చిన్న పెట్టెల్లో సింథటిక్ డ్రగ్స్, ఐదు 9ఎంఎం పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

For More News..

బర్త్‌డే రోజే సూసైడ్ చేసుకున్న మైనర్ బాలుడు

21 ఏండ్లలో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె.. రిటైర్మెంటప్పుడు కూడా అదే పోస్ట్ , అదే జీతం

పరీక్ష హాల్‌లోకి రానీయలేదని స్టూడెంట్​ సూసైడ్

Latest Updates