కరోనా వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజ్..భారతీయులకు ఆఫర్

కరోనా వ్యాక్సిన్ పేరుతో సొమ్ము చేసుకునేందుకు ఫార్మా తో పాటు టూరిజం సంస్థలు పోటీ పడుతున్నాయి. అమెరికాకు చెందిన కరోనా వ్యాక్సిన్ “ ఫైజర్ ” డిసెంబర్ నెలలో విడుదల కానుంది. అయితే ఫైజర్ పేరుని క్యాష్ చేసుకునేందుకు టూరిజం సంస్థలు వీవీఐపీలకు భారీ ఎత్తున ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ రాధికగుప్తా టూరిజం ప్యాకేజీల గురించి కొన్ని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రాధిక గుప్తా షేర్ చేసిన స్క్రీన్ షాట్ల ప్రకారం..అమెరికాకు చెందిన కరోనా వ్యాక్సిన్ ఫైజర్ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఆ వ్యాక్సిన్ భారత్ కు చెందిన వీవీఐపీలు ఫైజర్ ను దక్కించుకోవాలంటే రూ. 1,74,999 చెల్లించి ప్యాకేజీ చెల్లించాలి.  ప్యాకేజీని సొంతం చేసుకున్న వీవీఐపీలకు ముంబై టూ న్యూయార్క్ వెళ్లి అక్కడ ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం న్యూయార్క్ నుంచి ముంబైకి రావొచ్చు. ఈ ప్యాకేజీలో మూడు రోజులు..నాలుగు రాత్రుల పాటు బస, ఫ్లైట్ ఛార్జీలు, బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక డోస్ కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని సదరు టూరిజం సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Updates