పాసులు చెల్తలేవ్ : పైసలు డబుల్

బస్సుల్లేక అరిగోస.. సిటీలో పెరిగిన ప్రయాణ కష్టాలు

హైదరాబాద్ : కాళీమందిర్​ వెళ్లనీకి సావిత్రమ్మ (64) లంగర్​హౌజ్​లో బస్సెక్కింది. కాలుపెట్టనీకి కూడా సందులేదు. జనాలను తోసుకుంటూ వెళ్లి నిల్చుంది. కొంచెం దూరం పోంగనే టెంపరరీ కండక్టర్​ టికెట్​ అంటూ వచ్చాడు. తన దగ్గరున్న జనరల్​ పాస్​ చూపిస్తే.. ‘‘లె..లె.. పైసలియ్యాలె. పాస్​ నడ్వదు’’ అని చెప్పిండు. తన దగ్గర పైసల్లేవని చెప్పినా వినిపించుకోకుండా అక్కడనే నిర్ధాక్షిణ్యంగా దింపిండు.

‘నువ్వెవడవ్​.. పైసలిచ్చినా టికెట్​ ఇయ్యవా..? అడుక్క తిననీకి వచ్చినవా.. కష్టం చేస్తేనే పైసలొస్తున్నయ్​.. మర్యాదగా టికెట్​ ఇయ్యి.’ అని ఆరాంఘర్​ వెళ్లేందుకు బస్సెక్కిన ఓ ప్రయాణికుడు కండక్టర్​తో లొల్లికి దిగిండు. తన స్టేజీ నుంచి రూ.9 చార్జి ఉంటే రూ.18 ఎట్లా ఇస్తానని గొడవ పెట్టుకున్నడు. వీళ్లందరికీ టికెట్​ ఇయ్యలే.. ఎవ్వలూ అడుగుత లేరు. నీకే ఇయ్యాల్నా’ అని ప్రైవేట్​ కండక్టర్​ అనడంతో లొల్లి మరింత ముదిరింది.

సిటీలో జనరల్​ ​పాస్​ తీసుకుని బస్సుల్లో జర్నీ చేస్తున్న పేద, మిడిల్​ క్లాస్​కి చెందిన వేలాది మంది సఫర్​ అవుతున్నరు. ‘పాసులు చెల్లయ్​’ అని చెప్తుండడంతో రోజూ పైసలు పెట్టలేకపోతున్నరు. నెలవారీ బడ్జెట్​పై టికెట్​ ఖర్చులు అదనపు భారంగా మారినయ్​. ‘బస్​పాస్​కి డబ్బులు చెల్లించాం.. మళ్లీ పైసలెందుకు ఇయ్యాలె’ అని అడిగినా.. తాత్కాలిక సిబ్బంది మెడపట్టి మరీ గెంటేసిన ఘటనలున్నయ్​. పండుగ సెలవులు ముగిసి కాలేజీలు, స్కూళ్లు ఓపెన్​ కావడంతో స్టూడెంట్స్​ కూడా ఇబ్బందులకు గురవుతున్నరు. ​పాస్​లు చెల్లకపోవడంతో అదనంగా డబ్బులు కట్టలేక కాలేజీ మానేసే పరిస్థితి వస్తోంది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వాళ్లు తిరిగి సిటీకి వస్తుండడంతో సరిపోను బస్సుల్లేక ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఇంత జరుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనిపించడం లేదు.

Latest Updates