కరోనా సోకిన అర్చకులకు చెన్నైలో చికిత్స : వైవి సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకుల అనారోగ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అనారోగ్యానికి గురైన అర్చకులను మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. కైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆలయంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై మరో సారి సమీక్ష జరుపుతామని చెప్పారు. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా వైరస్‌ సోకింది. మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో వారు కూడా శ్రీవారి కైంకర్యాలకు దూరమయ్యారు. దీంతో స్వామివారి కైంకర్యాలకు అంతరాయం ఏర్పడకుండా తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులను డిప్యుటేషన్‌పై శ్రీవారి ఆలయంలో నియమించారు TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

Latest Updates