ఉస్మానియా మెడికోలకు గాంధీలో ట్రీట్‌‌మెంట్‌‌

ఉస్మానియా మెడికోలకు గాంధీలో ట్రీట్‌‌మెంట్‌‌
  • మరో 11 మంది స్టూడెంట్స్ అడ్మిట్ 

హైదరాబాద్/ పద్మారావునగర్, వెలుగు:  ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మరో 9 మంది మంగళవారం గాంధీలో అడ్మిట్ అయ్యారు. ఇద్దరు క్యాంటీన్ సిబ్బంది కూడా గాంధీలో చేరారు. శనివారం రాత్రి మెడికల్ స్టూడెంట్స్ 30 మంది తిన్న ఫుడ్ పాయిజన్ కావటంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. ఉస్మానియాలో ఫస్ట్ ఎయిడ్ చేసినప్పటికీ ఫలితం లేకపోవటం, అక్కడ బెడ్స్ కొరత ఉండటంతో సోమవారం 19 మంది స్టూడెంట్స్ గాంధీలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం మరో 11 మంది వచ్చి గాంధీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వీళ్లందరికీ ఆరోగ్యం బాగానే ఉందని గాంధీ సూపరిండెంట్ డాక్టర్ ఎం. రాజారావు  చెప్పారు. త్వరలోనే స్టూడెంట్స్ ను డిశ్ఛార్జ్ చేస్తామన్నారు.  ట్రీట్ మెంట్ పొందుతున్న స్టూడెంట్స్ ను మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శశికళ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
ఉస్మానియాలో బెడ్స్ కొరత
 రాష్ట్రంలోనే అతి పెద్ద హాస్పిటలైన ఉస్మానియాలో కాలేజ్ స్టూడెంట్స్ కే ట్రీట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏంటనీ? ఉస్మానియా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ పాత బిల్డింగ్ ను ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ తీవ్రంగా బెడ్ల కొరత ఉంది. పైగా వందల సంఖ్యలో పేషెంట్లు వస్తుండటంతో బెడ్స్ ఉండటం లేదు. సరైన సౌకర్యాలు లేకపోవటంతో నీట్ నెస్ కూడా తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని డాక్టర్లు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవటం లేదు. సోమవారం ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కే బెడ్స్ కొరత ఉండటంపై ఉస్మానియా డాక్టర్లు, జూడాలు ఆగ్రహంగా ఉన్నారు. మెడికల్ ఆఫీసర్లు కూడా స్టూడెంట్స్ కు బెడ్స్ ఏర్పాటు చేయకుండా గాంధీకి రెఫర్ చేయటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఫీవర్ హాస్పిటల్​ లోనూ ఇదే పరిస్థితి
ఫీవర్ హాస్పిటల్ లోనూ కనీస వసతులు లేవని డాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. తమ నిరసనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లే చెప్తున్నారు. బెడ్స్ లేక చాలా మందిని ఓపీలోనే చూసి పంపిస్తున్నామంటున్నారు. గాంధీ, ఉస్మానియా లో ఏడాదిన్నరగా క్యాథల్యాబ్స్ పనిచేయట్లేదంటున్నారు. గుండె జబ్బుతో వచ్చే పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్స్ రెఫర్ చేయాల్సి వస్తుందంటున్నారు. ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్ లో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.