గాంధీ లో ట్రీట్ మెంట్‌ బాగుంది: సోఫీ హెలెన్

గాంధీ హాస్పటల్‌లో ట్రీట్ మెంట్‌ బాగుందని బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 కోడలు సోఫీ హెలెన్ మెచ్చుకున్నారు. హాస్పిటల్‌లో క్వీన్ ఎలిజిబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నవజాత శిశువుల విభాగాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. దాదాపు 50 నిమిషాలు ఆమె చిన్నారుల విభాగంలోనే గడిపారు. నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు వచ్చే కంటి సమస్యలకు క్వీన్ ఎలిజిబెత్ డైమండ్ ట్రస్టు ద్వారా రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూ రిటీ (ఆర్‌ఓపీ) సేవలు అందిస్తున్నారు. ఈ ట్రస్ట్ కు వైస్ ప్యా ట్రన్‌గా ఉన్న సోఫీ హెలెన్ గాంధీ హాస్పటల్‌లో సేవలను స్వయంగా పరిశీలించారు. చిన్నారుల పేరెంట్స్‌తో మాట్లాడి ట్రీట్ మెంట్‌ గురించి తెలుసుకున్నారు. ఆర్ఓపీ ద్వారా అందిస్తున్న సేవలను ఆమెకు డాక్టర్లు వివరించారు. డిప్యూ టీ సూపరింటెండెంట్ నర్సింహారావు, డాక్టర్లు పాల్గొన్ నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూ ట్ ను ఆమె సందర్శించారు.

మీరు నాటిన మొక్క ఇంకా ఉందని అత్తకు చెబుతా

1983లో హైదరాబాద్ వచ్చిన క్వీన్ ఎలిజిబెత్-2 పాత గాంధీ హాస్పిటల్ వద్ద ఓ మొక్క నాటారు. అప్పటి నుంచి దాన్ని ప్రత్యే కంగా సంరక్షిస్తున్ నారు. సోఫీకి ఆమె అత్త నాటిన మొక్కను చూపించేందుకు హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్‌ ప్రయత్నించగా.. అనుకున్న షెడ్యూల్‌లో ఆ కార్యక్రమంలేదని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఇప్పటికీ ఆ మొక్క ఉందన్న విషయాన్ని అత్త క్వీన్ ఎలిజిబెత్ కు చెబుతానని అన్నారు. పిల్లల్నే కాదు..మొక్కలనూ బానే చూసుకుంటున్ నారన్నమాట’అంటూ సోఫీ చమత్కరించినట్లు డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.

Latest Updates