కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో 28 నుంచి ట్రెక్కింగ్‌‌‌‌ క్యాంప్

  •              దసరా సెలవుల సందర్భంగా ఆసిఫాబాద్, నిర్మల్ టూర్
  •                 ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వినోద్‌‌‌‌

యూత్‌‌‌‌ హాస్టల్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి అక్టోబర్‌‌‌‌ 11 వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో ట్రెక్కింగ్‌‌‌‌, క్యాంపింగ్‌‌‌‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బి. వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు. మంగళవారం ప్రోగ్రాం పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ క్యాంపులో ఆసిఫాబాద్‌‌‌‌, నిర్మల్‌‌‌‌ జిల్లాల్లోని కెరమెరీ ఘాట్‌‌‌‌, జోడేఘాట్‌‌‌‌, ట్రైబల్‌‌‌‌ మ్యూజియం, జైనూర్‌‌‌‌, సప్తగుండాల్‌‌‌‌ వాటర్‌‌‌‌ ఫాల్స్‌‌‌‌, కోసాయి, ఖండాలా ఘాట్స్‌‌‌‌, కవ్వాల్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌,  కడెం డ్యాం, పొచ్చెర, కుంటాల వాటర్‌‌‌‌ ఫాల్స్‌‌‌‌ సందర్శించవచ్చని తెలిపారు. దసరా సెలవుల సందర్భంగా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 88855 25256, 79893 46430 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ స్టేట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సిద్దబోయిన వెంకట్‌‌‌‌యాదవ్‌‌‌‌, ఉపాధ్యక్షుడు పురుషోత్తం పాల్గొన్నారు. మంగళవారం టీఎస్‌‌‌‌పీఎస్సీ మాజీ సభ్యుడు టి. వివేక్‌‌‌‌, ఈఆర్సీ మాజీ చైర్మన్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌ అలీ ఖాన్‌‌‌‌.. వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. రిటైల్‌‌‌‌ రంగంలో ఎఫ్‌‌‌‌డీఐలను ప్రోత్సహించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన తెలంగాణపై ప్రభావం పడుతుందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సంస్థలకు ప్రోత్సాహం అందించాలని వివేక్‌‌‌‌ సూచించారు.

Latest Updates