మార్కెట్లోకి ‘గిరిజన’ శానిటైజర్

  • సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లకు ఫ్రీగా పంపిణీ
  •  రోజుకు10 వేల బాటిళ్లు తయారీ
  •  60 వేల బాటిల్స్ ఆర్డర్ ఇచ్చిన ఐసీడీఎస్‌
  •  120 ఎంఎల్‌‌ శానిటైజర్‌‌ రేటు రూ. 48

కరోనా వైరస్‌‌ వ్యాప్తి నేపథ్యంలో గిరిజన కోఆపరేటివ్‌‌ కార్పొరేషన్‌‌ (జీసీసీ) స్వయంగా శానిటైజర్స్‌‌ తయారు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌‌లోని సంక్షేమ భవన్‌‌లో ఉండే వారి కోసం ఐదు వేల బాటిల్స్ తయారు చేసి ఇచ్చింది. సంక్షేమ భవన్‌‌లోని ఎస్టీ, బీసీ, ఎస్సీ, గురుకులాలు, కార్పొరేషన్లు తదితర 12 డిపార్ట్‌‌మెంట్లలోని అధికారులు, స్టాఫ్‌‌కు వీటిని ఫ్రీగా అందజేసింది. భవన్‌‌లోని ఎంట్రీ పాయింట్‌‌ వద్ద విజిటర్స్‌‌ కోసం 200 బాటిళ్లను అందుబాటులో ఉంచింది.

పర్ఫ్యూమ్‌‌ స్మెల్‌‌ శానిటైజర్‌‌

జీసీసీ ఆధ్వర్యంలో సబ్బులు తయారు చేసే చోటే శానిటైజర్స్‌‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ఐసోప్రొపైల్‌‌, ఆల్కహాల్‌‌, హైడ్రోజన్‌‌ పెరాక్సైడ్‌‌, గ్లిజరాల్‌‌, డీమినరలైజ్డ్‌‌ వాటర్‌‌తో దీన్ని తయారు చేస్తున్నారు. మిగతా శానిటైజర్స్‌‌ మాదిరి కాకుండా పర్ఫ్యూమ్‌‌ స్మెల్‌‌ వచ్చేలా నిమ్మకాయ గుజ్జుతోపాటు, ఇతర ద్రావణాలు వాడుతున్నారు. దీంతో మంచి స్మెల్‌‌ వస్తోందని, రోజుకు 10 వేల బాటిల్స్తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ నార్మ్స్‌‌ ప్రకారమే వీటిని తయారు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్‌‌ డైరెక్టర్‌‌ సర్వోత్తమ్‌‌రెడ్డి తెలిపారు.

భారీ ఆర్డర్ ఇచ్చిన ఐసీడీఎస్‌‌

లిక్విడ్ నాణ్యంగా ఉండడంతో జీసీసీ శానిటైజర్స్‌‌ కొనేందుకు ఇంటిగ్రేటెడ్‌‌ చైల్డ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సర్వీసెస్‌‌(ఐసీడీఎస్‌‌) ఆసక్తి చూపించింది. తమకు 60 వేల శానిటైజర్స్‌‌ ను ఆర్డర్ చేసింది.  దీంతో ఇప్పటికే 25వేల బాటిళ్లు తయారయ్యాయి. త్వరలోనే ఇండెంట్ కంప్లీట్ చేస్తమని అధికారులు చెబుతున్నారు.120 మిల్లీలీటర్ల ఉన్న హ్యాండ్‌‌ శానిటైజర్‌‌ను రూ.48 ధర నిర్ణయించారు.

Latest Updates