ఆదివాసీల పోరాట యోధుడు పగిడిద్ద రాజు

ఆదివాసీల పోరాటతత్వానికి నిలువెత్తు నిదర్శనం పగిడిద్ద రాజు. మేడారం జాతర ఆదివాసీల ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవ పోరాటాలకు ఓ ప్రతీక. ఆదివాసీల అస్థిత్వం కోసం కాకతీయుల ఆధిపత్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు పగడిద్ద రాజు. కాకతీయులపై జరిపిన వీరోచిత పోరాటంలో అమరుడయ్యాడు . కాకతీయులపై జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజుతో పాటు ఆయన బిడ్డలు సారలమ్మ, నాగులమ్మ, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజు ప్రాణాలు పోగొట్టుకోగా భార్య సమ్మక్క యుద్ధం చేస్తూ చిలకలగుట్ట ప్రాంతంలో అదృశ్యం అయి కుంకుమ భరిణ రూపంలో దర్శనమిచ్చింది. కప్పం కట్టడంలో వచ్చిన గొడవలు కాకతీయులకు ప్రతి ఏడాది అప్పటి కోయ రాజులు కప్పం కట్టే పద్ధతి ఉండేది. అయితే గోదావరి నది ఎండిపోవడంతో పంటలు పండక ఆకలితో అల్లాడుతుంటే కప్పం ఎలా కట్టగలమనేది కోయరాజుల వాదన. అయితే ఈ వాదనను కాకతీయులు పట్టించుకోలేదు. కోయరాజుల ఆవేదనను అర్థం చేసుకోలేదు. కప్పం కట్టాల్సిందేనని కాకతీయ రాజులు హుకుం జారీ చేశారు. ఈ హుకుంను కోయరాజు పగడిద్ద రాజు లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలోనే కాకతీయులకు, కోమరాజులకు మధ్య యుద్ధం మొదలైంది.

పగడిద్ద రాజు పాలనలో ఆదివాసీలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. నీతి నిజాయితీగా బతికారు. పగిడిద్దరాజు ఆరెం వంశీయుడు. దీనితో వేపలగడ్డ ఆరెం వంశీయులు ప్రతి ఏడాది మాఘపున్నమిమాసంలో పాదయాత్రగా మేడారం వెళ్లి అక్కడ సమ్మక్క – సారలమ్మ కు మొక్కులు చెల్లిస్తారు. తర్వాత గుండాల మండలంలోని వేపలగడ్డ గ్రామంలో జాతర నిర్వహిస్తారు. పగిడిద్దరాజు స్ఫూర్తితో ఇవాళ్టిరోజున ఆదివాసీలు తమ హక్కుల కోసం, తమ హక్కుల కోసం చట్టాలఅమలు కోసం, ఆదివాసీల అస్థిత్వం కోసం పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Latest Updates