నిర్మల్: అమర్ జవాన్ విగ్రహానికి రాఖీతో నివాళి

స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగ ఒకేసారి రావడంతో.. ఓ అమర జవాన్ కుటుంబానికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మల్ జిల్లాకి చెందిన నాగన్న-లక్ష్మీ దంపతుల కొడుకు కేశవ్ 2001లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2007లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని జ్ఞాపకంగా వ్యవసాయ బావి దగ్గర విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ప్రతి రాఖీ పౌర్ణమికి.. కేశవ్ విగ్రహానికి రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకుంటున్నారు. అంతే కాదు జనవరి 26, ఆగస్టు 15న నివాళులర్పిస్తారు.  ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పౌర్ణమి ఒకే సారి రావడంతో.. కేశవ్ కు రాఖీ కట్టి, ఘనంగా నివాళులర్పించారు.

Latest Updates