నాగులు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళి

తెలంగాణ వచ్చిన తరువాత కూడా త‌మ బతుకుల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న నాగులు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌లువురు కొవ్వొత్తుల‌తో నివాళులు అర్పించారు. తెలంగాణ పోరాటం లో నాగులు పాల్గొన్నాడ‌ని, తెలంగాణ ఉద్యమ కారులకు ప్ర‌భుత్వం సరైన గుర్తింపు ఇవ్వకనే నాగులు ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమం కారులను విస్మరిస్తుంద‌ని వారు అన్నారు

త‌న‌ భర్త తెలంగాణ ఉద్యమం లో పోరాటం చేశాడ‌ని నాగులు భార్య స్వరూప అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు సరైన‌ గుర్తింపు దక్కకనే ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.

పెట్ర‌ల్ పోసుకుని నిప్పంటించుకున్న త‌న భ‌ర్త‌కు ఉస్మానియా ఆసుపత్రిలో స‌రైన చికిత్స అంద‌లేద‌ని, ఆసుప‌త్రి నిర్లక్ష్యం కారణంగానే అత‌ను చనిపోయాడన్నారు. త‌మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Latest Updates