మూడో వంతు తిండి నేలపాలు

  • ఒకరికయ్యే ఫుడ్ ను నలుగురు వేస్ట్ చేస్తున్నరు
  • మార్కెట్లు, హోటళ్లలో ఫుడ్ పార్సిల్స్ సైజు తగ్గిస్తేనే మేలు
  • నెదర్లాండ్స్ వర్సిటీ రీసెర్చర్ల స్టడీ

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దోళ్లు. తిండి విలువ బాగా తెలిసినోళ్లు కాబట్టే ఫుడ్ను వేస్ట్ చేయకుండా ఉండేందుకని దానిని దేవుడి తోపోల్చారు . అయినా సరే.. మనం తిండిని వేస్ట్ చేస్తూనే ఉంటాం . పెడ్లిండ్లు, ఫంక్షన్లలో అయితే ఇక ఎంతఫుడ్ చెత్తకుప్పపాలయితదో చెప్పలేం . ఇంతకూఎంత ఫుడ్ వేస్ట్ అవుతోందంటే.. ప్రపంచంలో ప్రతి నలుగురు ప్రతి రోజూ ఒకరి కడుపు నిండేటంత తిండిని వేస్ట్ చేస్తున్నారట. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచమంతటా మూడో వంతు తిండి నేలపాలు అయిపోతోందట! నెదర్లాండ్స్ లోని వ్యాగెనింజెన్ యూనివర్సిటీ రీసెర్చర్ల స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫుడ్ వేస్ట్ అవుతోందన్నదానిపై  ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)’ గతంలోనే అంచనా వేసింది. వాస్తవానికి అంతకన్నా రెట్టింపుగా ఫుడ్ వేస్ట్ అవుతోందని తాజాగా నెదర్లాండ్స్ రీసెర్చర్లు వెల్లడించారు.

రోజూ 500 క్యాలరీలు వేస్ట్ చేస్తున్నం..

మనకు ఒక రోజుకు ఎంత తిండి అవసరం? అందాజాగ చెప్పా లంటే.. మగవాళ్లకు రోజూ 2000 నుంచి 3000 క్యా లరీల తిండి సరిపోతుందని,ఆడవాళ్లకు 1600 నుం చి 2,400 క్యా లరీల ఫుడ్ సరిపోతుందని సైంటిస్టు లు చెప్తారు . ప్రపంచంలో ఫుడ్ వేస్టేజీ గురించి 2015లో స్టడీ చేసిన ఎఫ్ఏవో..ఒక్కొ క్కరు రోజూ 214 క్యా లరీల తిండిని వేస్ట్ చేస్తున్నా రని అంచనా వేసింది. కానీ, అంతకన్నా రెట్టింపులో రోజూ 500 క్యాలరీల ఫుడ్ ను వేస్ట్ చేస్తున్నట్టు సైంటిస్టు లు తాజాగా తేల్చారు .అయితే, ఆ ఫుడ్ ను వేస్ట్ చేయకుండా  చూస్తే నలుగురు కలిసి ఒక మనిషి ఆకలి తీర్చొచ్చని అంటున్నారు .

10% పొల్యూషన్ తగ్గించొచ్చు..

తిండి కావాలంటే పంటలు పండించాల్సిందే.పంటలు పండించాలంటే రకరకాల పద్ధతులను అనుసరించాలి. యంత్రాలు వాడాలి. కరెంట్ కావాలి. పశువులు అవసరం. మొత్తంగా వ్యవసాయంలోని వివిధ దశల్లో ఇన్ డైరెక్ట్ గా భూమిని వేడెక్కించే గ్రీన్ హౌస్ వాయువులు పెద్దమొత్తంలోనే విడుదలవుతున్నా యని రీసెర్చర్లు పేర్కొంటున్నారు .అందుకే.. తిండిని వేస్ట్ చేయకుంటే పంటలు ఎక్కువ పండించాల్సిన అవసరం కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ వేస్టేజీని అరికడితే..ఈ రకంగా దాదాపు 10% గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించొచ్చని అంచనా వేస్తున్నారు .

ఫుడ్ సైజు తగ్గించాలె..

ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ వేస్టేజీని అరికట్టాలంటే.. ఫుడ్ పరిమాణాన్ని తగ్గించాల్సిందేనని వర్సిటీ రీసెర్చర్లు స్పష్టం చేశారు. ఉదాహరణకు.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఒక వ్యక్తి ఎంత తినగలడో అంత మొత్తంలోనే ఫుడ్ ఐటమ్స్ చేయాలి. ఒక్కొక్కరికి సరి పడేంత సైజుల్లోనే ఫుడ్ ను అమ్మాలి. అలాగే మార్కెట్లలోనూ అన్ని ఫుడ్ ఐటమ్స్ ను ఒక్కొక్కరికి సరిపోయేంతటి సైజుల్లోనే ప్యాక్ చేసి అమ్మాలి. అప్పుడు ఫుడ్ వేస్టేజీ తప్పనిసరిగా తగ్గిపోతుందని అంటున్నారు .

ఆదాయం పెరగడం వల్లే..

రోజుకు కనీస ఆదాయం రూ.500 (7 డాలర్లు)కు చేరిన తర్వాతే ఫుడ్ వేస్టేజీ ప్రారంభమైందని రీసె ర్చర్లు పేర్కొంటున్నారు . మామూలుగా అయితే సంపన్న దేశాల్లోనే జనం తిండినిఎక్కువగా  వేస్ట్ చేస్తుంటారని అనుకుంటాం .కానీ పే ద దేశాల్లోనూ ఆదాయం పెరుగుతున్నకొద్దీ ఫుడ్ వేస్టేజీ గణనీయంగా పెరుగుతోందని అంటున్నారు. అయితే, పంటలను మార్కె ట్ కుతీసుకొచ్చే క్రమంలో వేస్ట్ అయ్యే ఫుడ్ ను సైంటి స్టులు లెక్కలోకి తీసుకోలేదు. కేవలం మార్కెట్ నుంచి తీసుకొచ్చాక ఇళ్లు, హోటళ్లలో వేస్ట్ అవుతున్న దానిపై మాత్రమే లెక్కలేశారు. కల్లాల్లో నిధాన్యం మార్కెట్ కు, అక్కడి నుంచి వినియోగదారులకు చేరి, వారు ఆహారం తీసుకునే వరకూ.. జరిగే ప్రాసెస్ లో వేస్ట్ అయ్యే ఫుడ్ ప్రపంచంలో ఉత్పత్తవుతున్న ఆహారంలో మూడో వంతు ఉంటుందని చెబుతున్నారు .

Latest Updates