కరోనాతో తృణమూల్‌ ఎమ్మెల్యే మృతి

  • పోయిన నెలలో కరోనా పాజిటివ్‌
  •  హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ మృతి
  • నివాళులర్పించిన మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌‌ ఎమ్మెల్యే తమోనాశ్‌ ఘోష్‌ (60) కరోనా వైరస్‌తో చనిపోయారు. సౌత్‌ 24 పర్గనాస్‌లోని ఫల్టా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమోనాశ్‌ 1998 నుంచి పార్టీ ట్రెజరర్‌‌గా వ్యవహరిస్తున్నారు. మేలో ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో హాస్పిటల్‌లో చేశారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తమోనాష్‌ మృతి పార్టీకి తీరని లోటు అని సీఎం మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. “ మూడు సార్లు ఎమ్మెల్యేగా, 1998 నుంచి పార్టీ ట్రెజరర్‌‌గా పనిచేస్తున్న ఘోష్‌ మృతి బాధను కలిగించింది. 35 ఏళ్లు పార్టీకి, ప్రజలకు ఆయన అద్భుతమైన సేవ చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిది” అని మమతా బెనర్జీ అన్నారు. ఘోష్‌కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయిన ఎమ్మెల్యేల్లో ఘోష్‌ ఒకరు. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్బాజగన్‌ చనిపోయారు. కరోనా వైరస్‌ సోకి చనిపోయిన మొదటి ఎమ్మెల్యే అతనే.

Latest Updates