ట్రిపుల్ ధమాకా!.. ఒకేసారి ముగ్గురు కవలల పెళ్లి

ఒకేసారి ఇద్దరు కవలల పెళ్లిళ్లు చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది. అలాంటిది ఒకేసారి ముగ్గురు కవలలు పెళ్లిచేసుకుంటే కనులకు విందే. అలాంటి ఒక వేడుక కేరళలో జరిగింది. తిరువనంతపురంలో పంచరత్నాలుగా ఫేమస్ అయిన ఐదుగురు కవల పిల్లల్లో ముగ్గురు ఒకేసారి పెళ్లి చేసుకోవడం ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది.

గురువయూర్ శ్రీ కృష్ణుడి గుడిలో ఉత్రా, ఉత్తరా, ఉత్తమ అనే ముగ్గురు కవలపిల్లలు ఒకే ముహుర్తాన పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఈ పెళ్లిళ్లు వీళ్లకెంత క్రేజీగా ఉన్నాయో.. చూసేవాళ్లకి కూడా అంతే క్రేజీగా అనిపించింది. ఎందుకంటే పెళ్లికూతుళ్లు ముగ్గురూ ఒకేరంగులో ఉన్న చీరలు కట్టుకుని, ఒకేరకమైన దండలు వేసుకుని పెళ్లిపీటలపై రూల్స్ చూడచక్కగా కనిపించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంతో ఘనంగా ఈ పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఒకేకాన్పులో ఐదుగురు
తిరువనంతపురానికి చెందిన రమాదేవి అనే మహిళకు ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు పుట్టారు. ఉత్తమ్ నక్షత్రంలో వీరు పుట్టడంతో వీరిపేర్లు ఉత్తర, ఉత్తమ, ఉత్రా, ఉత్రజా, ఉత్రాజన్ అని పేర్లు పెట్టుకున్నారు. వీళ్లలో ఒకడు అబ్బాయి మిగిలిన నలుగురు ఆడపిల్లలు. ఈ నలుగురికి ఒకేసారి పెళ్లి చేయాలని రమాదేవి అనుకుంది. కానీ నలుగురు యువతులకూ ఒకేసారి నిశ్చితార్ధం జరిగినప్పటికీ ముగ్గురికి మాత్రమే ఒకేసారి పెళ్లి జరిగింది. మరొక యువతిని పెళ్లిచేసుకోబోయే వరుడు కువైట్ నుంచి సమయానికి రాలేకపోవడంతో ఆమె వివాహం అనుకున్న టైమ్ కి జరగలేదు.
ఆనందానికి అవధుల్లేవు
ఒకేసారి ముగ్గురు కూతుళ్ల పెళ్లి జరగడంతో తల్లి రమాదేవి ఎంతో సంతోషించింది. ‘కవల పిల్లలు పుట్టిన తరువాత భర్త చనిపోయాడు. దాంతో ఐదుగురు పిల్లల్ని పెంచడం కష్టంగా ఉండేది, ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, పిల్లలను ఎంతో కష్టపడి చదవించా’ అని చెప్పింది రమాదేవి. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించి ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడంతో చాలా సంతోషంగా ఉందామె.

Latest Updates