స్టేషన్ లో నిందితుడి చెంప ఛెళ్లు : కాంగ్రెస్ నేత ఆవేశం

త్రిపురలో ఓ కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయాడు. తమ కాన్వాయ్ పై దాడి చేసిన కేసులో అరెస్టైన నిందితుడి చెంప ఛెళ్లుమనిపించాడు. త్రిపుర కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ అభ్యర్థి ప్రగ్యా దేవ్ బర్మన్ కాన్వాయ్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆ వ్యక్తిని ఖొవాయ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సోదరుడు, త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్ ఆవేశంతో, అనుచరులతో స్టేషన్ కు వెళ్లాడు.

నేరుగా నిందితుడి దగ్గరకు వెళ్లి.. ఎందుకు చేశావ్ అంటూ ప్రశ్నించాడు ప్రద్యోత్. పోలీసులు అందరూ చూస్తుండగానే నిందితుడి చెంపపై లాగిపెట్టి కొట్టాడు. దీంతో అతడు కిందపడిపోయాడు. అక్కడున్న మిగతా నాయకులు .. నిందితుడికి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు కలగజేసుకుని ప్రద్యోత్ ను సముదాయించారు. ఆ తర్వాత అనుచరులతో అక్కడినుంచి వెళ్లిపోయాడు ఆ నాయకుడు.

ఈ సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు బయటపెట్టారు.

Latest Updates