రేప్ కేసుపెట్టిన యువతినే పెళ్లాడిన ఎమ్మెల్యే

తనపై రేప్ కేసును పెట్టిన యువతిని పెండ్లి చేసుకున్నాడు ఓ ఎమ్మెల్యే. ఈ ఘటన త్రిపురలో జరిగింది. ITFT పార్టీకి చెందిన ధనుంజోయ్… ‘రిమా వ్యాలీ’ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ధనుంజోయ్ తనపై అత్యాచారం చేశాడని  దలాయికి చెందిన ఓ మహిళ మే20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా తనతో చనువుగా ఉన్నాడని.. పెండ్లి పేరెత్తగానే తనకు సంబంధం లేదని అన్నాడని తెలిపింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ధనుంజయ్ పై కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బేయిల్ కోసం ధనుంజయ్ ప్రయత్నం చేయగా.. లాభం లేకపోయింది. ఇక చేసేదేమి లేక తనపై ఫిర్యాదు చేసిన మహిళనే ఆ ఎమ్మెల్యే పెండ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే.. స్వయంగా  మీడియాకు తెలిపాడు. పెండ్లికి ఇరు కుటుంబాలు హాజరైనట్లు ఎమ్మెల్యే తరపు న్యాయవాది చెప్పాడు.  మంగళవారం రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోనున్నట్లు తెలిపారు.

Latest Updates