ప్రియుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్న సంజయ్ దత్ కూతురు

ప్రియుడి జ్ఞాపకాలను మరచిపోలేక అతని పుట్టిన రోజున సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిషాలా దత్. గతంలో వాళ్లిద్దరు కలసి దిగిన ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ ఏడాది జూన్ 2 న త్రిషాలా దత్ తన ఇటాలియన్  బాయ్ ఫ్రెండ్ ను కోల్పోయింది. అతడి మరణంతో ఆమె కలత చెంది, అనుక్షణం అతని జ్ఞాపకాలతో రోజులు గడుపుతున్నానంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్టులు పెడుతోంది.

” ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, ఒక సెకను కాదు. నీ గురించి ఆలోచించని క్షణమే లేదు. హ్యాపీ బర్త్ డే , స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటున్నావనుకుంటున్నాను. ఐ లవ్ యూ, లవ్ , బెల్లా మియా” అంటూ త్రిషాలా ఓ పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో ” నన్ను ప్రేమించినందుకు, నన్ను రక్షించినందుకు మరియు నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ప్రపంచంలో కెల్లా అదృష్టవంతురాలైన అమ్మాయిని. నిన్ను తిరిగి కలుసుకునేంత వరకు నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. ఐ లవ్ యూ & ఐ మిస్ యూ” అని తెలిపింది.

త్రిషాలా దత్.. సంజయ్ దత్, అతని మొదటి భార్య రిచా శర్మ ల కూతురు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా రిచా శర్మ 1996 వ సంవత్సరంలో  చనిపోవడంతో  త్రిషాలా తన గ్రాండ్ పేరెంట్స్ వద్ద US లోనే పెరిగింది. తాను ప్రేమించిన వ్యక్తి కూడా అక్కడి వాడే. అతని మరణంతో దిగులు చెందుతోంది త్రిషాలా.

Latest Updates