కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ రైలు ప్రమాదం మరిచిపోకముందే..తిరుపతిలో కేరళ ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ నుంచి త్రివేండం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్ తిరుపతి ఏర్పేడు రైల్వే స్టేషన్ కూతవేటు దూరంలో పట్టాలు తప్పింది.  ప్యాంట్రి కార్ భోగి చక్రం విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం పై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. అయితే ప్రమాదం పై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కేరళ ఎక్స్ ప్రెస్ లోకో పైలైట్ చాకిచక్యంగా ట్రైన్ నిలిపివేయడంతో పట్టాలు తప్పిందని చెప్పారు. లేదంటే  భారీ ఎత్తున ప్రాణం జరిగి ఉండేదని రైల్వే  పోలీసులు చెబుతున్నారు.

 

    

 

    

 

Latest Updates