ఫల్టీ కొట్టిన ట్రాక్టర్ : ఒకరు మృతి..పలువురికి తీవ్ర గాయాలు

ఏపీలోని కృష్ణా జిల్లా తోలుకోడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బర్రె అడ్డం రావడంతో… ట్రాక్టర్ ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు రెడ్డిగూడెం మండలం ఓబుళాపురానికి చెందిన తిరుపతిరావుగా పోలీసులు గుర్తించారు. 11 మంది కూలీలు కుంటముక్కలలో ఇటుక బట్టీల పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Latest Updates