మజిలీలో సమంత, నాగార్జున నటన సూపర్ : తమన్

trolls-music-director-thaman-facebook-post

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్‌గానూ సక్సెస్‌ అయ్యింది. ఇటీవల ఈ మూవీ 100 డేస్ కంప్లీట్ చేసుకున్న సంద్భంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది సినిమా యూనిట్.

అయితే ఈ మూవీకి మ్యూజిక్ అందించిన తమన్ ఓ మిస్టేక్ చేశాడు. తాను మ్యూజిక్ అందించిన మజిలీ  సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తమన్‌ తన సోషల్ మీడియా పేజ్‌ లో యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. మజిలీలో లీడ్ పెయిర్ అయిన సమంత, నాగార్జున నటన సూపర్ అని రాశాడు. అయితే లీడ్ పెయిర్‌ అంటూ సమంత, అక్కినేని నాగార్జునల పేర్లు రాయటంపై సెటైర్లు పడుతున్నాయి. కొడుకు, తండ్రికి తేడా తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates