జైలే స్వర్గం.. ఇల్లే నరకం..!

tropical prison in Mexico that some don’t want to leave

కారాగారం నుంచి వెళ్లబోమంటూ మొండికేస్తున్న ఖైదీలు

ఎటుచూసినా ఎల్లలు కానరాని సముద్రం. పచ్చటి ప్రకృతి. పక్షుల కిలకిలారావాలు. మధ్యలో వందెకరాల జైలు. విశాలమైన గదులు. అత్యాధునిక సౌకర్యాలు. పూర్తిగా జైలు గదులకే పరిమితమవ్వాల్సిన పని లేదు. హాయిగా సముద్రగాలిలో అలా అలా బయట తిరగొచ్చు. ఏపుగా ఎదిగిన పామ్ చెట్ల నీడలో ముచ్చట్లు పెట్టొచ్చు . వీలైతే కునుకూ తీయొచ్చు. ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ల కోసం జిమ్, మానసిక ఉల్లాసానికి మ్యూజిక్ క్లాసులు. చుట్టూ స్పానిష్ తెలిసిన జైలర్లు. మాట కలిపితే చాలు రోజు గడుస్తుంది. టైంకు తిం డి బెడ్ దగ్గరకువస్తుంది. జీవితంలో ఇంతకన్నా సుఖం ఎక్కడైనాఉంటుం దా? బయటికెళ్తే ఎన్ని కష్టాలు. ఫుడ్డు, బెడ్డుకోసం పొద్దున బయటికెళ్తే రాత్రికి గానీ ఇంటి కితిరిగి రాలేం. మరోవైపు కుటుంబ భారం. ఏ బాదరా-బందీ లేకుండా, చీకుచింతా లేకుండా ఒక్క క్షణం గడపలేం. భూలోక స్వర్గం అనిపించే ఆ జైలును వదులుకోవడానికి ఎవరికైనా మనసొప్పుతుందా!

ఫసిఫిక్ మహాసముద్రంలోని మేరీ ఐల్యాండ్స్‌ లోఒకటైన ఐస్లా మారియా మాడ్రే ఐలాండ్‌ లో ఈ జైలు ఉంది. మేరీ ఐలాండ్స్ మొత్తం మెక్సికో ఆధీనంలోనే ఉన్నాయి. కరడుగట్టిన నేరస్థుల్ని బంధించేందుకు ఈ జైలును 1905లో కట్టారు. మెక్సికో తీరం నుంచి పడవలో 8 గంటలు ప్రయాణిస్తే కానీ ఇక్కడకు చేరుకోలేం. అందుకే జైల్లో ఉండే ఖైదీలను ఫ్రీగా బయట తిరగనిస్తారు. కొన్ని దొంగల కుటుంబాలు ఈ జైల్లో చాలా ఏళ్లు హాయిగా బతికిన దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడి నుంచి తప్పిం చుకుందామని చూసినా , దీవి దాటి వెళ్లలేరు.పైగా దీవిలో మెక్సికో భద్రతా దళాలు అడుగడుగునా నిరంతరం కాపలా కాస్తుంటాయి.

మెక్సికోకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ నాయకుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ ప్రెసిడెంట్‌ గా ఎన్నికయ్యారు.  ఐస్లా మారియామాడ్రే ఐలాండ్‌ లోని జైలుని కల్చరల్ సెంటర్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని, దానికి మెక్సికన్ రచయిత జోస్ రెవుల్టస్ పేరు పెట్టాలని సూచించారు. ఇందు కోసం జైలును మూసేస్తున్నట్లు ప్రకటించారు. వందేళ్లకు పైగాచరిత్ర కలిగిన ఈ జైల్లో ఇప్పటి వరకూ 64 వేల మంది ఖైదీలను ఉంచారు. గతేడాది 584 మంది ఖైదీలను మెయిన్ ల్యాండ్‌ లో ఉన్న జైళ్లకు తరలిం చారు. ప్రస్తుతం 137 మంది ఖైదీలు ఇక్కడ ఉంటున్నారు. ప్రెసిడెంట్ నిర్ణయం తెలిసిన కొందరు ఖైదీలు జైలును వదిలేందుకు ససేమిరా అంటున్నారట. కేవలం ఖైదీలకే కాదు. జైల్లో పని చేసే సిబ్బంది, వాళ్ల  కుటుంబాలు కూడా ఐలాండ్‌ తో ప్రేమలో పడ్డాయి. అక్కడి వాతావరణానికి వాళ్లు ముగ్ధులయ్యారు. హర్రీ బర్రీ లైఫ్ కు దూరంగా హాయిగా బతుకుతున్న వాళ్లకు ప్రెసిడెంట్ నిర్ణయం శరాఘాతంగా మారింది.

Latest Updates