TRS ఎంపీల శపథం : రిజర్వేషన్ల కోసం నిరసన కొనసాగిస్తాం

trs-mpsరిజర్వేషన్ల కోసం ఎంతవరకైనా వెళ్తామని.. అవసరమైతే ధర్నాలు కూడా చేస్తామన్నారు TRS ఎంపీలు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్లో అవిశ్వాసం చర్చకు వస్తే అందులో పాల్గొనాలని TRS  నిర్ణయించింది.

TRS పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే సభను వాయిదా వేస్తోందన్నారు. వెల్ లోకి వెళ్లకుండానే లోక్ సభలో నిరసనను కొనసాగిస్తామన్నారు. రిజర్వేషన్ అంశాన్ని చర్చలో చెబుతామన్నారు. మా సమస్య కోసం మేము పోరాటాలు చేస్తే మమ్మల్ని తప్పుబడుతున్నారన్నారు. సమస్య పరిష్కారం కోసం మాత్రమే పోరాటం చేయడం లేదని.. అన్నాడీఎంకే కూడా పోరాటం చేస్తుందన్నారు. రిజర్వేషన్ల కోసం ఎన్నో సార్లు ప్రధానిని కలిశామన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలన్నారు. ఏ వర్గాలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో రాష్ట్రాలకే తెలుస్తుందన్నారు.

తెలంగాణ ప్రజలకు బాధ కలిగేలా కొందరు ఏపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు ఎంపీ కవిత. విభజన అశాస్త్రీయంగా జరిగిందని, అన్యాయం చేశారంటూ తమను, తమ ప్రజలను.. తమ ఉద్యమాలను కించపరిచేలా ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నాయకులు వారి వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తామన్నారని.. దాన్ని కచ్చితంగా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో తమ సమస్యలపై పోరాటం చేస్తుంటే.. అవిశ్వాస తీర్మానంపై చర్చను అడ్డుకుంటున్నామని ఏపీ నేతలు విమర్శించడం సరికాదన్నారు.

Posted in Uncategorized

Latest Updates