TRS కు ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు: అసద్

టీఆర్ఎస్ అధినేత కేసీఆరే మరోసారి సీఎం కానున్నట్లు తెలిపారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇవాళ (సోమవారం) ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం ముగిసిన తర్వాత ఓవైసీ మీడియాతో మాట్లాడారు. ఆయనతో తాను మూడు గంటల పాటు భేటీ అయ్యానని.. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చించామన్నారు. తమ పార్టీ తరఫున కేసీఆర్‌తో భేటీ అయ్యానని.. రేపటి తీర్పు కేసీఆర్‌కు అనుకూలంగా రానుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆయనతోనే ఉన్నారని చెప్పారు. పూర్తి మెజార్టీతో TRS ప్రభుత్వం ఏర్పడనుందని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు TRS కు అవసరం లేదన్నారు. అయినప్పటికీ తాము కేసీఆర్ కే పూర్తి మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు MIM నుంచి 8 మంది కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు అసద్.

 

Posted in Uncategorized

Latest Updates