TRS బిగ్ విక్టరీ : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏ పార్టీ గెలుస్తుందా అని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ లపై పడ్డాయి పలు మీడియా సంస్థలు. ఇప్పటికే టీఆర్ఎస్ విక్టరీ ఖాయం అని చెప్పింది టైమ్స్ నౌ. ఇండియా టుడే త‌న ఎగ్జిట్ పోల్ స‌ర్వే రిపోర్ట్‌ ను విడుద‌ల చేసింది. ఆ రిపోర్ట్ ప్ర‌కారం టీఆర్ఎస్ పార్టీకి 79 నుంచి 91 సీట్లు ద‌క్క‌నున్నాయి. కేసీఆర్ చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలే ఆ పార్టీకి మ‌ళ్లీ అధికారాన్ని అందిస్తాయ‌ని ఇండియా టుడే స‌ర్వే తెలిపింది.  స‌ర్వే ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 33 సీట్లు ద‌క్క‌నున్నాయి. బీజేపీకి 3 సీట్ల వ‌ర‌కు రావ‌చ్చు అని స‌ర్వే అంచ‌నా వేసింది.

టీఆర్ఎస్‌కు 46 శాతం ఓటు షేర్ ద‌క్కినట్లు స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ స్కీమ్‌ లు ఓట‌ర్ల‌ను చాలా ఆక‌ర్షించాయని వివరించింది.  ముస్లిం, హిందూ ఓట‌ర్లు కేసీఆర్ వైపు మొగ్గు చూపార‌ని చెప్పారు ఎడిట‌ర్ రాజ్‌ దీప్. స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌తిప‌క్షం లేకుండా పోయింద‌ని ఆ ఛాన‌ల్ అభిప్రాయ‌ప‌డింది. కేసీఆర్ త‌న అద్భుత‌మైన ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లను ఓట్ల వైపు ఆక‌ర్షించార‌ని తెలిపింది ఇండియా టుడే. మరిన్ని చానెల్స్ తమ ఎగ్జిట్ పోల్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates