TRS రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం

rajyaTRS పార్టీ తరపున రాష్ట్రం నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఏప్రిల్ 4వ తేదీ బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్ లు ఉన్నారు. మాతృభాష తెలుగులోనే వారు ప్రమాణ పత్రం చదివారు. సభ ప్రారంభమైన వెంటనే వీరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.

కొత్త సభ్యులకు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం తర్వాత ముగ్గురు సభ్యులు ఉపరాష్ట్రపతి, చైర్ పర్సన్ వెంకయ్యని కలసి ధన్యవాదాలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates