TRS రైతు ప్రభుత్వం : పోచారం

TRS రైతు ప్రభుత్వం అన్నారు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివస్ రెడ్డి. వ్యవసాయ రంగం అభివృద్ధి, సంక్షేమం కోసం అత్యధిక నిధులను కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇవాళ (సెప్టెంబర్-30)న నిజామాబాద్, బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో ఎన్నికల ర్యాలీ, ప్రచార సభలో పాల్గొన్న పోచారం ఈ సందర్భంగా మాట్లాడారు.  గతంలో ఏ ప్రభుత్వం, నాయకుడూ వ్యవసాయరంగం, రైతుల కోసం ఇంతగా నిధులను కేటాయించలేదన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.8వేలు ఇస్తున్నామని చెప్పారు.

దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విత్తనాలు,ఎరువుల కొరత లేదని.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనట్లుగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో రూ.83 వేల కోట్లతో 40లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతు తెలిపి, కారు గుర్తుకే ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు పోచారం.

 

Posted in Uncategorized

Latest Updates