TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్

TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్.  దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో కేటీఆర్ కు పార్టీలో కీలకమైన పదవి అప్పగించారు. ఇవాళ డిసెంబర్-14న మధ్యాహ్నం 2 గంటలకి జరగనున్న రాష్ట్రకార్యవర్గ సమావేశంలో.. అధికారికంగా వెల్లడించనున్నారు సీఎం కేసీఆర్. పార్టీలో మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించారు

ప్రభుత్వ పరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్ణయంతో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను తూ.చా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో తనపై పని భారం పెరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే TRS పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించినట్లుగా తెలుస్తోంది.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా TRS పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌ కు అప్పగించారు. దేశంలోనే అతిగొప్ప పార్టీగా TRS ను రూపుదిద్దాలనే సంకల్పంతో  ఉన్నారు KCR. అందుకు ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్‌ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని  నిర్ణయించారు సీఎం కేసీఆర్.

 

 

 

Posted in Uncategorized

Latest Updates