వారణాసికి రైతుల ముసుగులో TRS కార్యకర్తలు

నిజామాబాద్ జిల్లా నుంచి వారణాసి వెళ్లిన 45 మంది రైతులపై…. పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.TRS నాయకుల ఆధ్వర్యంలో ఎలా నామినేషన్లు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు తమ ఉద్యమనికి దూరంగా ఉండి, ఇప్పుడు వారణాసిలో పోటీ ఏంటో చెప్పాలంటున్నారు. టీఆర్ఎస్ సానుభూతి పరులు కాకపోతే నిజామాబాద్  పార్లమెంటు ఎన్నికల్లో కవిత మీద ఎందుకు నామినేషన్లు వేయలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనను అడ్డుకోవాలనే  ఉద్దేశ్యంతో TRS పార్టీ…. రైతుల ముసుగులో TRS కార్యకర్తలను వారణాసికి పంపిందని ఆరోపిస్తున్నారు.

 

Latest Updates