మున్సిపల్ లొల్లి.. బీఫామ్ ఇవ్వలేదని పెట్రోల్ పోసుకుండు

మేడ్చల్ మున్సిపాల్టీలో టికెట్ల లొల్లి  ముదిరింది.14 వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి  విజయ్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు.  పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒంటిపై పెట్రోలో పోసుకుంటుండగా..పోలీసులు,స్థానికులు అడ్డుకున్నారు. పోలీస్టేసన్ కు తరలించారు.

విజయ్ కుమార్ మాట్లాడుతూ  టీఆర్ఎస్ అధిష్టానం ఉద్యమంలో పాల్గొన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని చెప్పినా స్దానిక నాయకులు మాత్రం టిక్కెట్ అమ్ముకుంటున్నారని అన్నారు. తనను 25 లక్షల డిపాజిట్ చూపించమన్నారని.. దళితుడ తాను అంత నగదు ఎక్కడ నుంచి తేవాలన్నారు.  తనకు అన్యాయం జరిగిందనే  మనస్తాపంతోనే ఆత్మహత్యా యత్నం చేశానన్నాడు.  పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనకు కొందరు నేతలు మోసం చేస్తున్నారని విజయ్ ఆరోపించారు.

Latest Updates