టీఆర్ఎస్ పతనం మొదలైంది: పొన్నం

టీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు కరీంనగర్ కాంగ్రెస్  MP అభ్యర్థి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంపై ప్రజల్లో  వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. దీనికి నిదర్శనమే నిన్నటి కేసీఆర్ సభ అని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చటంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యిందన్నారు పొన్నం ప్రభాకర్. కరీంనగర్‌లో కేటీఆర్‌ రోడ్‌షో అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందన్నారు. కులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు పొన్నం.

Latest Updates