ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లిపోవాలంటూ TRS ఫిర్యాదు

హుజూర్ నగర్ ఉపఎన్నికకు సోమవారమే పోలింగ్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ పూర్తిచేసింది. పోలింగ్ కు ముందు.. రాజకీయ వేడి మరింత పెరిగింది. పోలింగ్ ఉండటంతో.. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ అసెంబ్లీ పరిధి నుంచి వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గ ఓటర్ అని.. అతడికి ఇక్కడేం పని అంటూ ఉత్తమ్ ను సెగ్మెంట్ నుంచి బయటకు పంపించాలంటూ కంప్లయింట్ లో ఈసీకి తెలిపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ నియోజక వర్గ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.

Latest Updates