అండగా ఉంటాం…ఆదరించండి

మండల ప్రజలకు అండగా ఉంటాను ఆదరించాలని మంచాల జడ్పీటీసి కాంగ్రెస్ అభ్యర్థి నిత్యనిరంజన్ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆమె ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలకోసం పనిచేసే నాయకులనే ఆదరించాలని కోరారు. పట్నం ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మంచాల కాంగ్రెస్ ఎంపీటీసి అభ్యర్థి ఎడ్మ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భద్రరెడ్డి, సంపత్ రెడ్డి,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కీసర మండల పరిధిలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఆదివారం కీసరలో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మచ్చని జంగయ్య యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. నాయకులు మోర రవికాంత్, శ్రవణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, జంగయ్య, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

పేదప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న టీఆర్ఎస్ ను గెలిపించాలని మంచాల టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ లక్ష్మి అభ్యర్థిం చారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆమె ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. మంచాల టీఆర్ ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి జంబుల కిషన్ రెడ్డి, సర్పంచ్ జగన్ రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Latest Updates