TRS కార్పోరేటర్ కు జరిమానా విధించిన GHMC

అనుమతులు లేకుండా రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జీహెచ్ఎంసీ ఝలక్ ఇచ్చింది. మల్కాజిగిరిలో బోనాలు సందర్భంగా మల్కాజిగిరి నుంచి సఫిల్ గూడా వరకు అనుమతులు లేకుండా రోడ్లపై ప్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు మల్కాజిగిరి టీఆర్ఎస్ కార్పోరేటర్ జగదీష్ గౌడ్ కి రూ.10వేల జరిమానా విధించింది జీహెచ్ఎంసీ. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఇతర పార్టీల నాయకులకు కూడా జరిమానా విధించనున్నారు అధికారులు.

Latest Updates