టీఆర్ఎస్ కార్పొరేటర్ మా ప్లాట్‌‌ను కబ్జా చేశాడు

హైదరాబాద్: హయత్‌‌నగర్‌‌ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ నేత సామ తిరుమల్ రెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఓ కుటుంబీకులు ఆరోపించారు. తిరుమల్ రెడ్డి తన తమ్ముడు శ్రీధర్ రెడ్డితో కలసి తమ ప్లాట్ కబ్జా చేశాడని నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకెలపల్లికి చెందిన ఐతగొని వెంకన్న కుటుంబం ఆందోళనకు దిగింది. చిన్న పిల్లలతో వచ్చి హయత్‌‌నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వెంకన్న నిరసన చేపట్టారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ శవాలు తీసుకున్నా సరే గానీ ప్లాట్ మాత్రం ఇవ్వబోమన్నారు. హయత్‌‌నగర్‌‌లోని ఆర్టీసీ కాలనీలో తన తండ్రి కొన్న 533 గజాల స్థలాన్ని నోటరీ రెగ్యులరైజ్ చేయించడం కోసం పేపర్లు ఇస్తే కబ్జా చేశారని ఆరోపించారు. తిరుమల్ రెడ్డి కబ్జా చేసిన తమ ప్లాటును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

Latest Updates