కరోనా సర్వే అడ్డుకున్న టీఆర్‌ఎస్ కౌన్సిలర్ అరెస్ట్

రక్షణ కల్పించాలంటూ నిర్మల్‌‌ కలెక్టరేట్ ఎదుట సిబ్బంది ధర్నా
కలెక్టర్ ఆర్డర్ తో కౌన్సిలర్ అరెస్ట్, కేసు

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాను అరికట్టేందుకు కృషిచేస్తున్న అధికారులు, వైద్య, పోలీసు సిబ్బందికి కొందరి వల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయి. కరోనా నియంత్ర ణ చర్యల్లో భాగంగా శనివారం నిర్మల్ టౌన్లోసర్వే చేస్తున్నఆశా వర్కర్లు, వైద్య సిబ్బందిని ఆ వార్డు టీఆర్‌‌ఎస్ కౌన్సిలర్ జహీర్ అడ్డుకొని దురుసుగా మాట్లాడారు. ఆశ వర్కర్లు, పోలీసులు సర్దిచెబుతున్నప్పటికీ వినకుండా, మేం ఎలాంటి వివరాలు ఇవ్వం వెళ్లిపోండన్నారు. దీంతో ఆశా వర్కర్లు, నర్సులు నిర్మల్ కలెకరే్టట్ ఎదుట ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వే కోసం వెళ్తేకొంతమంది
తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్‍ఎంపీ సోయం బాపురావు నిర్మల్ కలెక్టర్‍ను కలిసి దాడుల అంశంపై చర్చించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వే చేసేవారికి రక్షణ కల్పిస్తామని కలెకర్్ట ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

కౌన్సిలర్ జహీర్ అరెస్ట్
సర్వే కోసం వెళ్లిన ఆశా కార్యకర్తలను అడ్డుకొని దురుసుగా మాట్లాడిన జహీర్‌‌‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్‌‌‌‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి కౌన్సిలర్‍ను అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌‌రావు వెల్లడించారు.

Latest Updates