మున్సిపల్​ ఆఫీసులో కొట్టుకున్న టీఆర్ఎస్​ కౌన్సిలర్లు

వేములవాడ మున్సిపల్​ ఆఫీసులో రచ్చ

వేములవాడ, వెలుగు: కామన్​ గా అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్​ ఆఫీసులో టీఆర్ఎస్​కౌన్సిలర్ల మధ్యే ఫైటింగ్​జరిగింది. శనివారం వేములవాడ మున్సిపల్ ఆఫీసులో అధికార పార్టీ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్​మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీసులో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలంటూ వైస్ చైర్మన్ మధు రాజేందర్​ వాగ్వాదానికి దిగారు. రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు తిట్టుకుంటూ ఒకరినొకరు తోసేసుకున్నారు. కొంతకాలంగా
చైర్​పర్సన్ ​రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ గొడవలు జరిగినప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు ఎమ్యెల్యే రమేశ్​బాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో మరోసారి గొడవలు తారాస్థాయికి చేరాయని పలువురు ఆరోపిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్బంధం

బెల్లంపల్లి టౌన్ లో అధికార పార్టీలో ఆధిపత్య పోరు నేపథ్యంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డులో సింగరేణి భూమిలో లైబ్రరీకి ప్రహారీ కడుతున్నారు. లైబ్రరీ పక్కనే అంగన్
వాడీ సెంటర్ ఉండడంతో ప్రజల రాకపోకలకు వీలుగా ప్రహరీకి గేట్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కరుణాబాయి గతంలోనే స్థానిక
ఎమ్మెల్యేతో పాటు లైబ్రరీ చైర్మన్ ను కోరారు. అయితే గేటు ఏర్పాటు చేయకుండానే ప్రహరీ నిర్మిస్తున్నారు. శుక్రవారం పనులు చివరి దశకు చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కౌన్సిలర్ కరుణాబాయిని స్టేషన్ కు తీసుకెళ్లి నిర్బంధించారు. ప్రహారీ పని పూర్తయిన తర్వాత ఆమెను వదిలిపెట్టారు. మహిళా కౌన్సిలర్ ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అగౌరవపర్చారంటూ ఆమె భర్త, మున్సి పల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి అవమానించారంటూ కరుణాబాయి శనివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా
కలెక్టర్ కు సైతం కంప్లైంట్ ఇచ్చారు.

For More News..

వరుస పండుగలతో కరోనా పైపైకి! ఐదు రోజుల్లో 6,798 మందికి వైరస్​

Latest Updates