హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్- సీపీఐ పొత్తు?

త్వరలో జరగనున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ సీపీఐ పార్టీ మద్దతు కోరింది.

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలని సీపీఐను కోరారు టీఆర్ఎస్ నేతలు. ముగ్థుం భవన్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు కేకే, నామా నాగేశ్వరరావు, వినోద్. ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై నేతలు మాట్లాడుకున్నారు. తమకు సపోర్ట్ చేయాలని సీపీఐను రిక్వెస్ట్ చేశారు గులాబీ నేతలు. దీనిపై సీపీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఒకటో తారీఖు కార్యవర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు చాడ.

Latest Updates