కేసీఆర్ కూడా సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు

హైదరాబాద్ : మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచేది TRS పార్టీనే అన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం TRS భవన్ లో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్..మున్సిపాలిటీల సంఖ్యను పెంచిన ఘనత TRSదేనని.. మోడీకి, రాహుల్ గాంధీకి భయపడమన్నారు. బీజేపీకి అభ్యర్థులే దొరకడంలేదని.. టీఆర్ఎస్ కు పెయిడ్ వర్కర్స్ లేరన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ బలంగా వార్తలను పెట్టాలన్నారు. TRSకు ఫేస్ బుక్, ట్విట్టర్ లో చాలా మంది ఫాలొవర్స్ ఉన్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాలో మరింత ప్రచారం చేయాలని తెలిపారు. ప్రస్తుతం టీవీల వచ్చే వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని.. సోషల్ మీడియాలో TRS అభిప్రాయాలు బలంగా ఉన్నాయని తెలిపారు కేటీఆర్. కేసీఆర్ కూడా సోషల్ మీడియానే ఫాలో అవుతారన్నారు.

సోషల్ మీడియాలోనే కాకుండా వినూత్నమైన ప్రచారం చేయాలని సూచించారు. సంక్రాంతి పండుగలోనూ ప్రచారం ఉండాలని.. ముగ్గుల్లో, పతంగిలపై కారుగుర్తు, కేసీఆర్ ఫొటోలు పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతిపక్షాల నెగెటివ్ కామెంట్స్ ను తిప్పికొట్టాలని.. అవసరమైతే సబ్జెక్ట్, TRS చేపట్టిన పథకాలను చెప్పి వారి కామెంట్లకు రిప్లై ఇవ్వాలన్నాడు. సోషల్ మీడియా అప్డేట్స్ కి సంబంధించి పలువురుని సెలక్ట్ చేసి ఓ కమిటీని నిర్ణయించాడు మంత్రి కేటీఆర్. పార్టీ ఫొటోలు, కంటెంట్, పథకాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలన్న కేటీఆర్.. TRS హవా చూపించాలన్నాడు.

Latest Updates