బారు..బీరు..సర్కారు: లక్ష్మణ్

సాగునీరు… తాగునీరు కావాలని ప్రజలు కోరుతుం టే ఈ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ మాత్రం ఇంటిం టికి బారు.. బీరు… అంటూ తాగుబోతులుగా మార్చే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌‌‌‌ శుక్రవారం మహబూబ్‌ నగర్‌‌‌‌ ఆపార్టీ విజయసంకల్ప సభలో ఫైర్‌‌‌‌ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్‍ పతనానికి నాంది అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కూడా ఓడిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్‌‌‌‌ బాట పడతారు పాలన సజావుగా సాగిస్తారని చురక అంటిం చారు.కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వం .. మీ అవినీతిని బయటపెడటం ఖాయమని.. తెలంగాణ ప్రజలకు మీ నుం చి విముక్తి కల్పించడం తధ్యమని అన్నా రు.తెలంగాణలో అన్ని పార్లమెంట్‍ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతాం అంటున్నారు. అయితే చక్రం కాదు కదా… ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా పార్లమెంట్‍ ఫలితాలు ఉంటాయన్నారు. మా ప్రధాని అభ్యర్థి మోడీ… మరి మీ పీఎం అభ్యర్థి ఎవరో చెప్పా లని డిమాండ్‍ చేశారు. మోసపూరిత మాటలతో కుటుంబ పాలన సాగిస్తున్న మీ తీరును తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారన్నా రు. అనంతరం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ నేను మీ ఆడ బిడ్డగా ముందుకు వచ్చాను… టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నిరంకుశపాలనకు ముగింపు పలికి మోడీని మళ్లీ ప్రధాని చేయాలని పిలునిచ్చారు. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కావని.. మాయమాటలు నమ్మకుండా కేసీఆర్‌‌‌‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Latest Updates