కరీంనగర్ కార్పోరేషన్ కూడా టీఆర్ఎస్‌కే

కరీంనగర్ కార్పోరేషన్ లో టీఆర్ఎస్ దూసుకెళ్లింది. ఉత్కంఠ పోరులో ఏకంగా 33 సీట్లలో గులాబీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ విషయానికొస్తే 13 సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ. ఎంఐఎం ఆరు సీట్లలో గెలవగా… ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరవలేదు.

ప్రభుత్వ పనితీరు నచ్చి ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు మంత్రి గంగుల కమలాకర్. తమను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం రేపటి నుంచే పనిచేస్తామన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కొన్ని ఓట్లను బీజేపీ తీసుకుందని ఆరోపించారు. సీఎం సూచించిన వ్యక్తినే మేయర్ గా ఎంపిక చేస్తామన్నారు మంత్రి.