ఎంఐఎంతో కలిసి దేశాన్ని టీఆర్‌‌ఎస్ భ్రష్టు పట్టిస్తోంది

సగం బంగ్లాదేశ్ వచ్చేస్తది
దానికి ఎవరిది బాధ్యత? రాహుల్‌‌దా, కేసీఆర్‌‌దా?
సీఏఏతో ఇక్కడోళ్లకు ఏ నష్టం ఉండదు
ఎంఐఎంతో కలిసి దేశాన్ని టీఆర్‌‌ఎస్ భ్రష్టు పట్టిస్తోంది
‘సంత్​ రవిదాస్​’ జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు‘చొరబాటుదారులకు సిటిజన్‌‌షిప్‌‌ ఇస్తే సగం బంగ్లాదేశ్‌‌ ఖాళీ అయి ఇక్కడికే వచ్చేస్తది. దానికి ఎవరు బాధ్యత వహిస్తరు. రాహుల్‌‌ గాంధీనా? కేసీఆరా?’ అని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి ప్రశ్నించారు. శరణార్థులు, చొరబాటుదారులు వేర్వేరని, చొరబాటుదారులకు పౌరసత్వం ఇవ్వాలని కొందరు అర్థంలేని డిమాండ్‌‌ చేస్తున్నారన్నారు. కానీ మేం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని సీఏఏ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. 130 కోట్ల ఇండియన్స్‌‌లో ఏ ఒక్కరికీ నష్టం జరిగినా ప్రభుత్వం దృష్టికి తేవాలని ప్రతిపక్షాలకు కిషన్ రెడ్డి సూచించారు. ఆదివారం బీజేపీ స్టేట్‌‌ ఆఫీస్‌‌లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీసంత్ రవిదాస్ 621 జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కిషన్​రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్​రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎంతో జతకట్టి దేశాన్ని టీఆర్‌‌ఎస్​భ్రష్టు పట్టిస్తోందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలకు రాజ్యాంగం ప్రకారం అనేక రకాల హక్కులు వచ్చాయన్నారు. కానీ పాకిస్తాన్‌‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, బౌద్ధులు, సిక్కులకు ఎలాంటి హక్కులు లేవన్నారు. శ్రీసంత్ రవిదాస్ చదువుకున్నది తక్కువే అయినా అనేక మందిలో చైతన్యం తెచ్చారన్నారు.

ఆయన పోరాటం స్ఫూర్తి : లక్ష్మణ్

శ్రీసంత్ రవిదాస్ గొప్ప సంఘ సంస్కర్త అని, దళిత సామాజికవర్గంలో పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కవిగా, ప్రవక్తగా మన్ననలు పొందారని, ఆయన పోరాటం దళితులకు స్ఫూర్తి అని చెప్పారు. బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిని ‘సంత్’ అంటారని, ఆయన ఆశయాల కోసం అందరూ శ్రమించాలన్నారు.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం

Latest Updates