తెలంగాణ కోసం పోరాడిన వాళ్లను కేసీఆర్ పట్టించుకోలేదు : బీజేపీ నేత స్వామిగౌడ్

తెలంగాణ కోసం పోరాడిన అనేక మందిని టీఆర్ఎస్ పక్కన పెట్టిందని బీజేపీ నేత స్వామిగౌడ్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల నుంచి కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు చెప్పారు. వారం రోజుల క్రితం కేసీఆర్ ను కలిసేందుకు ట్రై చేసినా అపాయిట్మెంట్ ఇవ్వలేదన్నారు. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల తరువాత కూడా ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తున్నట్లుగా ఉందన్న ఆయన.. బీజేపీలో చేరడం తన సొంత ఇంటికి చేరినట్లు అనిపిస్తుందన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

Latest Updates