బీజేపీలో చేరిన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్

టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమనేతగా టీఆర్ఎస్ లో చురుకైన పాత్రపోషించిన స్వామీగౌడ్ కేంద్ర బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్న స్వామీగౌడ్ గత కొద్దిరోజులుగా గులాబీ దళంపై గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్వామిగౌడ్..తాజాగా బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.

Latest Updates