సపోర్ట్ చేయలేదని కార్యకర్తపై టీఆర్ఎస్ నేత దాడి

ఎన్నికలు ముగిసినా.. వాటి ఫలితాల ప్రభావం మాత్రం ఇంకా నాయకుల్ని, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను వదలడం లేదు. ఎన్నికల్లో తమ ఓటమికి కారణం మీరేంటే.. మీరంటూ ఒకరినొకరు దూషించుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు. అటువంటి దాడే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. శివ అనే వ్యక్తిపై టీఆర్ఎస్ నేత వెంకటేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో గాయపడ్డ శివ పరిస్థితి సీరియస్‌గా ఉంది. వెంటనే పోలీసులు శివను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల్లో శివ ప్రత్యర్థి వర్గానికి సపోర్టు చేయటంతో కక్ష పెంచుకున్న వెంకటేష్, అతనిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. శివపై దాడి చేసిన తర్వాత వెంకటేష్ వేముల వాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డ్ టీఆర్ఎస్ కౌన్సిలర్ విజయ్‌ గెలుపును జీర్ణించుకోలేక ఓటమిపాలైన ప్రత్యర్థి సుల్తాన్ శేఖర్; విజయ్ సోదరుడైన రాజుపై మంగళవారం కత్తిపోట్లకు దిగాడు. ఆ సంఘటన మరువకముందే.. ఈరోజు మరో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఓయూలో రేపు జాబ్​ మేళా

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

Latest Updates