టీఆర్ఎస్ లీడర్‌పై దాడి.. పార్టీ సీనియర్ నేతపై అనుమానం

రాజేంద్రనగర్: నగర శివారులోని నార్సింగి లో టీఆర్ఎస్ నాయకులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. కత్తులు, కొడవళ్లు, కట్టెలతో విపరీతంగా దాడి చేయడంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన  రాజ్ కుమార్ అనే లీడర్ తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

నిన్న అర్ధరాత్రి నుండి నార్సింగిలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరుగుతుందని.. ఆ గొడవ కారణంగానే రాజ్ కుమార్ పై దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవి ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నార్సింగి మునిసిపాలిటీ వైస్ చైర్మన్, TRS పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ తో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు.

Latest Updates