కేంద్రం నిధులివ్వడం లేదు కాబట్టే అప్పులు చేస్తున్నాం : టీఆర్ఎస్

రావాల్సిన బకాయులు కేంద్రం చెల్లించడం లేదు కాబట్టే.. తమ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తోందని చెప్పారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. దేశం మొత్తం ఆర్ధిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతోందన్నారు. అందుకే తాము ఓటన్ అకౌంట్ కంటే ఇప్పుడు బడ్జెట్ ను తగ్గించాల్సి వచ్చిందన్నారు. కేంద్రం నుంచి రూ.20,000 కోట్లు రావాల్సి ఉంటే.. రూ.2,000 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఆటో మొబైల్ రంగంలో 16 శాతం అమ్మకాలు తగ్గిపోయాయన్నారు. విమానయాన ప్రయాణాలు కూడా తగ్గిపోయాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామన్నారు కర్నె ప్రభాకర్. రైతులకు ఇబ్బంది కలగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పారు.

Latest Updates